సత్తుపల్లి వైస్‌ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత.

సత్తుపల్లి వైస్‌ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత.

- మూడో వార్డు ప్రజల విశ్వాసానికి ప్రతిఫలం.
- అభివృద్ధే లక్ష్యమన్న నూతన వైస్‌ చైర్‌పర్సన్.

సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు అభ్యర్థిగా విజయం సాధించిన ఆమెను ఈ పదవికి ప్రకటించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వం అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. సత్తుపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తానని, పట్టణ ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పారదర్శకంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై విశ్వాసంతో గెలిపించిన మూడో వార్డు ప్రజల సేవే తనకు ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రజల ఆశీర్వాదంగా భావించి మరింత అంకితభావంతో పనిచేస్తానని నూతన వైస్‌ చైర్‌పర్సన్ బొంతు సుమలత తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .