మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం

కాంగ్రెస్ ఉప్పల్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం

మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.పరమేశ్వర యూత్ అధ్యక్షులు నాగి ముదిరాజ్, శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో ముందుండి ఆరోగ్యంగా, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. మల్లాపూర్ డివిజన్‌లో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరింతగా జరగాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పరమేశ్వర్ రెడ్డి హాజరుకావడంతో యువతలో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన పరమేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మక్తాల బాలరాజ్ గౌడ్, తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, జానీ వేణు, నిక్కీ గౌడ్, టిల్లు, కప్పర సాయి, ఎస్.వి. కిట్టు, సురేష్ గౌడ్, పర్వతాలు, వెంకన్న, జయంత్, వినేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260216-WA0107

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .