గవర్నర్ చేతుల మీదుగా ‘విశిష్ట ప్రతిభా రత్న’ అవార్డు అందుకున్న సెరినిటీ విద్యార్థులు
Views: 50
On
నాగారం, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు)
హిందీ సేవా సదన్ మహావిద్యాలయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన నాగారం సెరినిటీ పాఠశాల విద్యార్థులు హరిక, ఆరాధ్యలకు ‘విశిష్ట ప్రతిభా రత్న’ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకోవడం పాఠశాలకు గర్వకారణమని కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి తెలిపారు.రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం సాధించినందుకు విద్యార్థులకు రూ.2,500 నగదు బహుమతి, బంగారు పతకం, ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.పాఠశాల తరఫున బుధవారం విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి పాఠశాల పేరును రాష్ట్ర స్థాయిలో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments