అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ 

పేద వృద్ధురాళ్లకు నెలసరి పించన్ పంపిణీ

అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ 

ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 17 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్‌లో అమావాస్య సందర్భంగా వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.సమాజ సేవలో భాగంగా ప్రతినెల పేద వృద్ధురాళ్లకు అందజేస్తున్న రూ.1000 చొప్పున పించన్‌ను ఈ సందర్భంగా మాలే వరమ్మ, కొండూరి విజయ, తోడుపునూరి ఉమారాణి, పడకంటి కమలమ్మలకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.వాసవి మిత్రమండలి చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు స్థానికులు అభినందించారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వాసవి మిత్రమండలి అధ్యక్షులు పెద్ది నాగరాజు గుప్త, ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి రాముని తిరుమలేష్ గుప్త, కార్యనిర్వాహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త, ఉపాధ్యక్షులు నంగునూరి అశోక్ గుప్త, తాటి శ్రీనివాస్ గుప్త, కార్యదర్శులు బాచెల్లి నవీన్ గుప్త, అమర కృష్ణ గుప్త, చందా సంతోష్ గుప్త, కార్యవర్గ సభ్యులు మిర్యాల అరుణ్ కుమార్ గుప్త, ఉప్పల ఆంజనేయులు గుప్త, ఉప్పల శ్రీనివాసులు గుప్త, బెలీదే బాగువాన్ గుప్త, రవ్వ ఈశ్వరరావు గుప్త, చంద్రగిరితారకేశ్వర్ గుప్త, IMG-20260217-WA0205కమిశెట్టి రామలింగం గుప్త, పెద్ది నవీన్ గుప్త, రాయల సంతోష్ గుప్త, గజ్జల రమేష్ గుప్త, దిడిగం కైలాసం గుప్త, రాయికంటి ముత్యాల గుప్త, దాచా ప్రసాద్ గుప్త, పెద్ది శ్రీనివాస్ గుప్త, దారం అనిల్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .