చిన్న పాపను తప్పించబోయి బైక్ అదుపు తప్పి ప్రమాదం.

చిన్న పాపను తప్పించబోయి బైక్ అదుపు తప్పి ప్రమాదం.

- అక్కకు తీవ్ర గాయాలు.
- సమయానికి స్పందించిన 108 సిబ్బంది.

సత్తుపల్లి, ఫిబ్రవరి 17 (తెలంగాణ ముచ్చట్లు): 

స్థానిక మండల పరిధిలోని కిష్టారం గ్రామంలోని అన్నపురెడ్డిపల్లి రోడ్డులో చిన్న పాపను తప్పించబోయి బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు తన అక్క, భార్యతో కలిసి కిష్టారం నుంచి చెరుకుపల్లి గ్రామానికి వెళ్తుండగా అకస్మాత్తుగా ముందుకు వచ్చిన చిన్న పాపను తప్పించబోయి బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి అక్క కూరం భద్రమ్మ (50) తీవ్రంగా గాయపడింది. ఆమె ఎడమ కాలు మడమ, పాదం తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది ఈఎంటి గొల్లమందల కృష్ణ, పైలట్ ఏకాంత్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయాలకు కట్లు కట్టి, అవసరమైన ఇంజక్షన్లు అందిస్తూ, సెలైన్ బాటిళ్లు అమర్చి, ఆక్సిజన్ అందించారు. అలాగే మెడకు సీ-కాలర్ పెట్టి అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .