నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు

నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు చేరవేయండి

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 17(తెలంగాణ ముచ్చట్లు)

రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అడ్డా అనే నానుడిని మరోసారి నిరూపించి మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని అలాగే నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు వార్డు కౌన్సిలర్లకు అభినందనలు అని జిల్లా  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  నూతి సత్యనారాయణ గౌడ్, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు లు అన్నారు.మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు  సాగాలని సూచించారు. ప్రతి సమస్యను తెలుసు కోవాలి సమస్యలకు పరిష్కారంలో ముందుండాలన్నారు. రాజకీయాల కతీతంగా ప్రతీ ఒక్కరి సమస్య విని... వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విజయం నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంకితం అని అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదీ కాదు ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తది అని పేర్కొ న్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా పని చేయాలని సూచించారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. ఇది అందరి సమష్టి విజయం అని అన్నారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ...కౌన్సిలర్ లు గా సేవ చేయడం గొప్పగా అవకాశంగా భావించాలని, మీ వార్డు లో చేసే అభివృద్ధి కలకాలం గుర్తుండి పోవాలన్నారు. మనం గెలిచింది ఈ ప్రాంతాన్ని బాగు చేయడం కోసం, కాలనీలను అభివృద్ధి చేసి ప్రజల ఆశీర్వాదం పొందడం కోసం అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరవేయాల్సిన భాధ్యత మున్సిపల్ కౌన్సలర్ గా ఎన్నికై న ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదేవిధంగా మున్ముందు జరగబోయే ఎం పీ టి సి, జెడ్ పి టి సి ఎన్నికలు త్వరలో వస్తాయని అందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, బ్లాక్,మండల అధ్యక్షులు గ్రామ శాఖ అద్యక్షులు,గ్రామ ముఖ్య నాయకులు సన్నద్ధం కావాలని తద్వారా కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరుస్తూ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని పత్రికా ముఖంగా కోరనైనది.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్ గౌడ్, నగర ఐ యన్ టి యు సి అద్యక్షులు నరాల నరేష్ నాయుడు , నగర కాంగ్రెస్ నాయకులు కోసూరి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు చేరవేయండి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 17(తెలంగాణ ముచ్చట్లు) రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం...
కోర్టు ఆదేశానుసారమే...భూదాన భూముల్లో పేదల ఇళ్లు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చలివేంద్రం ప్రారంభోత్సవం
అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ 
జోర్డానో బ్రూనో 426వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
చిన్న పాపను తప్పించబోయి బైక్ అదుపు తప్పి ప్రమాదం.