ఘనంగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర, ఫిబ్రవరి 17 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం బోడుప్పల్‌లోని ప్రతాప్ సింగారంలో ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళా నాయకురాళ్లు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు.మహిళా కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు సునీత మాట్లాడుతూ, సుధీర్ రెడ్డి నాయకత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచిందని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు దుర్గా, మేడ్చల్ ‘ఏ’ బ్లాక్ అధ్యక్షురాలు తాటికాయల కోమలత, దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షురాలు సమతా యాదవ్, ఫీర్జాదిగూడ కార్పొరేషన్ రెండవ వార్డు అధ్యక్షురాలు తండా పరమేశ్వరి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ శిల్ప తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సుధీర్ రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. సుధీర్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు


Comments