మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చలివేంద్రం ప్రారంభోత్సవం

ఆది జాంభవ అరుంధతి సేవాసమితి సేవా కార్యక్రమం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చలివేంద్రం ప్రారంభోత్సవం

కీసరగుట్ట, ఫిబ్రవరి 17 (తెలంగాణ ముచ్చట్లు): 

కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం ఆది జాంభవ అరుంధతి సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.సమితి అధ్యక్షుడు మొరుగు ముత్యాలు, ఫౌండర్ జనరల్ సెక్రటరీ బక్కని నర్సింగ్ రావు నాయకత్వంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ సేవను వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అన్నదానం, మజ్జిగ వంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ భక్తులకు సేవ చేయడంలో ముందుంటామని తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన కొమ్ము సుదర్శన్, తుడుం శ్రీనివాస్, బక్కని కుమార్, మాజీ ఎంపీపీ రామారం సుజాత, బుడిగే జగన్, మంకి రాజు, కంచెమిది సంతోష్, చొక్కాపురం శ్రీరాములు, చినింగిని మల్లేష్, మంచాల రాజలింగం, రామారం రమేష్, తుడుం యాదగిరి, సైదులు మహారాజ్, కొమ్ము రవి, బండారి నర్సింగ్ రావు, గుడ్డేల రాము, మళగళ్ల శివకుమార్, బి. మధు, బోడ వెంకటేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే మీడియా ప్రతినిధులు, సీనియర్ నాయకులకు సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .