నేరెడ్మెట్‌లో శివాజీ జయంతి వేడుకలకు ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం

నేరెడ్మెట్‌లో శివాజీ జయంతి వేడుకలకు ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం

మల్కాజిగిరి, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గంనేరెడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కేపురం ప్రాంతంలో ఆదిదేవ్ అసోసియేషన్ మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో, అలాగే డిఫెన్స్ కాలనీలో హిందూ ఏకతా యూత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు హాజరుకావలసిందిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, యువతకు శివాజీ మహారాజ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ధైర్యం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలకు ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు.వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కే శ్రీను, మహిపాల్ రెడ్డి, కొతపల్లి ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, రమేష్ గౌడ్, శ్యామ్, ఆకారం సాయి, సాయి ప్రవేశ్, మహేష్, బాబీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .