ఉపాధ్యాయుడిగా సుదీర్ఘ సేవలందించిన భగవంతుకు ఘన వీడ్కోలు

ఉపాధ్యాయుడిగా సుదీర్ఘ సేవలందించిన భగవంతుకు ఘన వీడ్కోలు

పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలంగా సేవలందించిన ఉపాధ్యాయుడు భగవంత్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం ఆనందోత్సాహాలతో కళకళలాడింది.కార్యక్రమానికి డీఈవో, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై భగవంత్ సేవలను కొనియాడారు. ఆయన బోధనా విధానం, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని వక్తలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన భగవంత్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. ఈ పాఠశాల నా కుటుంబం లాంటిది. ఇక్కడ గడిపిన ప్రతి క్షణం నాకు అమూల్యం.సహచర ఉపాధ్యాయుల సహకారం, గ్రామస్తుల ప్రోత్సాహం వల్లనే నేను నా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలిగాను. నా విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరి సమాజానికి ఆదర్శంగా నిలవాలి. అదే నాకు నిజమైన బహుమతి, అని అన్నారు.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సభను మరింత ఆకట్టుకున్నారు.అనంతరం జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, మండల విద్యాధికారి మంజుల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు తదితరులు కలిసి భగవంత్‌ను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నం అందజేశారు.గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం స్మరణీయంగా నిలిచింది.కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు): పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని...
ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం
ఘనంగా ఆలిండియా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం