చర్చి కాలనీలో చకచకా అభివృద్ధి పనులు ప్రారంభం

రూ.2.27 కోట్లతో మౌలిక సదుపాయాల మెరుగుదల

చర్చి కాలనీలో చకచకా అభివృద్ధి పనులు ప్రారంభం

ఉప్పల్, ఫిబ్రవరి 18 ( తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ డివిజన్ పరిధిలోని చర్చి కాలనీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.2 కోట్ల 27 లక్షల వ్యయంతో కాలనీలో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు.కాలనీలో కలుషిత మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1 కోటి 9 లక్షలతో కొత్త వాటర్ పైప్ లైన్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైప్‌లైన్ పనులు పూర్తయిన వెంటనే రూ.1 కోటి 18 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నాయకులు తెలిపారు.ఈ పనులను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.చర్చి కాలనీలో వాటర్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను రూ.2.27 కోట్లతో చేపట్టినట్లు వారు తెలిపారు. అతి త్వరలోనే ఈ పనులు పూర్తై ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీకాంత్ రెడ్డి, చర్చి కాలనీ అధ్యక్షులు జానీ, సుధాకర్, లుకాస్, రత్న రెడ్డి, డేవిడ్, ప్రవీణ్, సతీష్, సునీల్, రోసి మేరి,కార్తీక్IMG-20260218-WA0084పుష్పాలమ్మ, ఫ్రాన్సిస్, బాలస్వామి, సల్ల ప్రభాకర్ రెడ్డి, సందీప్, భాస్కర్, రాఘవేంద్ర, వల్లపు శ్రీకాంత్ యాదవ్, సాగ శ్రీధర్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .