సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!

ఈ నెల 22న హైదరాబాద్‌లో సభ.

సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!

దమ్మపేట, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

సీఆర్పీ యూనియన్ తెలంగాణ ఆధ్వర్యంలో సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనం అనంతరం నిర్వహించనున్న ఏఐటీయూసీ పరిచయ–అభినందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలోని సిఆర్పిలందరికీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్ సమీపంలోని ముగ్దుం భవన్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్‌రెడ్డి, చాడా వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కలవేణ శంకర్, ఎస్‌.బాలరాజు, ఎం.నరసింహ, కడారి సునీల్ పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సిఆర్పిల సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికగా ఈ సమ్మేళనం కీలకమని తెలిపారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘంగా ముందుకు సాగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ తరఫున కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .