ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం

ఉప్పల్, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ) నూతన కమిటీ సభ్యులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, 35 సంవత్సరాల తర్వాత ఉప్పల్‌లో సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నాయకత్వంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఐకమత్యం, స్నేహబంధంతో నూతన కమిటీ సమర్థవంతంగా పని చేసి మీడియా గౌరవాన్ని మరింత పెంచాలని ఆకాంక్షించారు.మీడియా నిష్పక్షపాత ధోరణితో పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుండాలని సూచించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీజేపీ అధ్యక్షుడు మారినేని ఫణిందర్, ప్రధాన కార్యదర్శి తీగ విట్టల్ రావు, కోశాధికారి దువ్వాళ రమేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .