పేద విద్యార్థికి అండగా జంగం శివ… ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం

పేద విద్యార్థికి అండగా జంగం శివ… ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం

పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల పరిధిలోని అనకాయపల్లి తండాకు చెందిన గోపాల్ నాయక్ కుమారుడు తేజ నాయక్ మెడికల్ సీటు సాధించి మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే సామాజిక సేవకుడు జంగం శివ స్పందించారు.అనకాయపల్లి తండాకు వెళ్లిన జంగం శివ, పెద్దమందడి గ్రామ సర్పంచ్ శ్రీమతి సూర్య గంగమ్మ రవి చేతుల మీదుగా తేజ నాయక్‌కు రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఊషన్న, వార్డు సభ్యుడు రవి, కాంగ్రెస్ కార్యకర్త స్వామి మరియు తండావాసులు పాల్గొన్నారు. గ్రామస్తులు జంగం శివ  సహృదయతను అభినందిస్తూ, ఆయన సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .