మోజర్ల గ్రామంలో టీబీ ఛాతీ ఎక్స్‌రే నిర్ధారణ శిబిరం నిర్వహణ

మోజర్ల గ్రామంలో టీబీ ఛాతీ ఎక్స్‌రే నిర్ధారణ శిబిరం నిర్వహణ

పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ పంచాయతీలో బుధవారం టీబీ ఛాతీ ఎక్స్‌రే నిర్ధారణ శిబిరాన్ని గ్రామ సర్పంచ్, వైద్య సిబ్బంది కలిసి నిర్వహించారు. గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.శిబిరంలో మొత్తం 85 మందికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. వీరిలో అనుమానిత లక్షణాలు ఉన్న 23 మందికి తేమడ (స్పుటమ్) నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. గ్రామస్తులు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డా. ప్రవళిక, టీబీ సిబ్బంది, సూపర్వైజర్ రామస్వామి, ఏఎన్ఎమ్ లలిత, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్ రాయకంటి రాములు, ఆశ వర్కర్లు గిరిజా, సత్యమ్మ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు): పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని...
ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం
ఘనంగా ఆలిండియా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం