మహాశివరాత్రి సందర్భంగా చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

మహాశివరాత్రి సందర్భంగా చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

మల్లాపూర్, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు): 

మహాశివరాత్రి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాందిని క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ బండ భావి కమ్యూనిటీ హాల్‌లో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు మళ్లించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందుతాయని అన్నారు. క్రీడలు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇటువంటి టోర్నమెంట్లు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.25,000 నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన కుషాయిగూడ బాయ్స్ జట్టుకు రూ.15,000 ప్రైజ్ మనీని అందించి క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కోయలకొండ రాజేష్, నాగి ముదిరాజ్, శివ ముదిరాజ్, రాజు ముదిరాజ్, బాబ్లు, సందీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో నెమలి అనిల్ కుమార్ ప్రోత్సాహం ఆదర్శప్రాయమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .