పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి

పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):

పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని తూడి మేఘారెడ్డి సూచించారు.బుధవారం మద్దిగట్ల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)గా సేవలందించిన అశ్విని భగవంతు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, సమాజ మార్పుకు గురువుల బోధనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అలాంటి గురువులు పదవి విరమణ అనంతరం కూడా సమాజోద్ధరణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత కూడా తమ సేవలతో మంచి గుర్తింపు నిలుపుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పదవి విరమణ పొందుతున్న అశ్విని భగవంతు, రాధా దంపతులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260218-WA0093

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .