నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కీసర, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఫీడర్లలో కీసర సబ్‌స్టేషన్ నిర్వహణ పనులు చేపట్టనున్నందున కీసర పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కీసర విద్యుత్ శాఖ ఏఈ ఎస్. మురళీ కృష్ణ తెలిపారు.
రాంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు 11 కె.వి శ్రీనగర్ ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, చెర్లపల్లి నుండి రాంపల్లి రోడ్ వరకు, సాయి నగర్ కాలనీ, జ్యోతి కాలనీ, డీఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.అలాగే యాద్గార్పల్లి సబ్‌స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు 11 కె.వి యాద్గార్పల్లి ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో యాద్గార్పల్లి గ్రామం, చితారామ్మ ఆలయం, టింబర్ డిపో, ఎస్సీ కాలనీ, రామస్వామి కాలనీ, యాద్గార్పల్లి ఏజీఎల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.అత్యవసర అవసరాల కోసం ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ పనులకు సహకరించాలని ఏఈ ఎస్. మురళీ కృష్ణ విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .