ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 23న “ఛలో హైదరాబాద్”

ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 23న “ఛలో హైదరాబాద్”

_కుషాయిగూడ పీహెచ్‌సీ వద్ద వినతిపత్రం 
– యూనియన్ నేతల పిలుపు

కుషాయిగూడ, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నేతలు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి, జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణలు కుషాయిగూడ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ప్రజారోగ్య రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన పారితోషికం, భద్రత, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణీలు, శిశువులు, బాలింతల సంరక్షణలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయినప్పటికీ నెలల తరబడి పారితోషికాలు పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.ప్రధాన డిమాండ్లు:పెండింగ్ పారితోషికాలు, బిల్లులు వెంటనే చెల్లించాలి,కనీసం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి,ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి,ఎన్సీడీ (ఎన్ సి డి) సర్వే పేరుతో అదనపు పనిభారం తగ్గించాలి,ఏ ఎన్ సి, పి ఎం సి టార్గెట్ల ఒత్తిడిని నిలిపివేయాలి,పనిభారానికి అనుగుణంగా సదుపాయాలు, భద్రత కల్పించాలి,ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.జిల్లాలోని ఆశా కార్యకర్తలందరూ ఫిబ్రవరి 23న జరిగే “ఛలో హైదరాబాద్” కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.IMG-20260221-WA0046

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .