సోలిపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  మేఘారెడ్డి

సోలిపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  మేఘారెడ్డి

ఖిల్లా ఘనపురం,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘనపురం మండలం సోలిపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సోలిపురం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నదని, దానికి అనుబంధంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యఅధికారి సాయినాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సింధు శేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG-20260221-WA0058

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .