బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం

బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం

పెద్దమందడి,ఫిబ్రవరి19(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన దంతనూర్ రమేష్ (50), తండ్రి రాములు, మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ పేద కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉండగా, స్థానిక నాయకులు విషయం తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, మేఘన్న అభయహస్తం కార్యక్రమం ద్వారా ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని నిర్ణయించారు. తన ప్రతినిధులుగా కాంగ్రెస్ నాయకులను పంపించి, మృతుడి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద రూ.5,000/-రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మృతుడి నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు రమేష్ భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సూర్య రవి, ఉప సర్పంచ్ బోయిని ఉషన్న యాదవ్, మాజీ ఎంపీటీసీ బుచ్చన్న, మాజీ సర్పంచ్ కుడుకుంట్ల వెంకటస్వామి, వార్డ్ మెంబర్లు వాకిటి రమేష్, నీలం రవి, కొమ్ము సత్యనారాయణ, టీఎంఆర్, అలాగే కాంగ్రెస్ శ్రేణులు రాఘవేంద్ర, రామాంజనేయులు, గొడుగు రాజశేఖర్, జంగం శివ, గొల్ల మొగిలి, మన్యం, మేస్త్రీ జానీ, శ్రీను, ఇరామోని సత్యనారాయణ, గొడుగు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.కష్టకాలంలో స్పందించి ఆర్థికంగా అండగా నిలిచిన ఎమ్మెల్యేకు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నాయకత్వం ఉండటం తమ అదృష్టమని గ్రామస్తులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News