ఆకట్టుకున్న వైరా వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ప్రసంగం..

ఆకట్టుకున్న వైరా వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ప్రసంగం..

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 20(తెలంగాణ ముచ్చట్లు)

 వైరా మున్సిపాలిటీ రెండవ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగించిన వైరా వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ప్రసంగం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. వైరాలో ఉన్న సమస్యలను, పరిష్కరించే మార్గాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి తగ్గట్లుగా నడుచుకుంటామని అన్నారు.  ఏ సమస్య మా దృష్టికి వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అధికారులు కూడా వెంటనే వాటిని పరిష్కరించాలని సూచించారు. తనతోపాటు చైర్ పర్సన్ కాపా చంద్రకళ ఆర్థికంగా బాగానే ఉన్నామని, మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామని పేర్కొన్నారు. ఒక్క పైసా కూడా  మున్సిపాలిటీ నుండి తీసుకోబోమని, నిధులన్నీ ప్రజలకే ఖర్చు చేస్తామని సభలో ప్రసంగించారు. దీంతో స్టేజి మీద ఉన్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో పాటు హాజరైన ప్రజలు ఒక్కసారిగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైనాప్పటికీ  కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, వైరా మున్సిపాలిటీ  వైస్  చైర్మన్ గా కట్ల సంతోష్ ప్రసంగం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉందని ప్రజలు చర్చించుకోవడం విశేషం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .