జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని కలిసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

శ్రీధర్ రెడ్డి హత్యకేసు విచారణ వేగవంతం చేయాలని వినతి

జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని కలిసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తిఫిబ్రవరి19( తెలంగాణ ముచ్చట్లు):

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం జిల్లా ఎస్‌పి సునీతా రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి బి.ఆర్‌.ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు రెండేళ్లు గడిచినా కుటుంబానికి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.అధికారులు మారుతున్నప్పటికీ కేసు పురోగతి కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ప్రత్యేక పరిస్థితుల్లో కింది స్థాయి అధికారులు ఒత్తిడులకు లోనై పార్టీ నాయకులపై అవసరం లేకుండానే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.ఇటువంటి ఘటనలను నివారించి న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు.ఈ విషయాలపై ఎస్పీ సునీతా రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.తదుపరి పెబ్బేరు ప్రాంత నాయకులు జిల్లా  ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు.నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, మాజీ చైర్మన్ కరుణశ్రీ, శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కర్రీస్వామి, శివరామ్ రెడ్డి, దొడ్ల రాములు, ఎద్దుల సాయి కుమార్, జాతృ నాయక్, పానుగంటి విజయ్ మోహన్, ఎం. రమేష్, టి. కురుమయ్య, అబ్దుల్ మహమూద్, సయ్యద్ జమీల్,చిట్యాల రాము తదితరులు హాజరయ్యారు.IMG-20260219-WA0099

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .