మిషన్ భగీరథ నీటితో ఆరోగ్య భద్రత

సర్పంచ్ చిట్యాల వెంకటయ్య

మిషన్ భగీరథ నీటితో ఆరోగ్య భద్రత

పెద్దమందడి,ఫిబ్రవరి19(తెలంగాణ ముచ్చట్లు): 

మిషన్ భగీరథ త్రాగునీరు వినియోగంతో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వీరాయిపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల వెంకటయ్య అన్నారు. పెద్దమందడి మండలం లోని వీరాయిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్ జవాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ త్రాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే శుద్ధి చేసిన త్రాగునీటిని వినియోగించుకోవాలని సూచించారు. శుభ్రమైన నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తోందని తెలిపారు.అదేవిధంగా మిషన్ భగీరథ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొని త్రాగునీటి వినియోగంపై వివరాలు తెలియజేశారు.ప్రతి కుటుంబం మిషన్ భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు మిషన్ భగీరథ ఇన్‌ట్రా డీఈఈ హరిష్ కుమార్, గ్రేడ్ డీఈఈ విజయ్ కుమార్, ఇన్‌ట్రా ఏఈఈ హరి ప్రకాష్, గ్రేడ్ ఏఈఈ కామిల్, ఏఈఈ శుక్ల, ఫీల్డ్ అసిస్టెంట్ రహీం, గ్రామ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .