కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం

కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం

_శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయం తరఫున జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ, మీడియాకు కృతజ్ఞతలు

కీసరగుట్ట, ఫిబ్రవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయం లో నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల అపార స్పందనతో విజయవంతంగా ముగిశాయి.వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్, డి.ఆర్.ఓ., జిల్లా అధికార యంత్రాంగానికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కీసర ఆర్డీవో, తహసీల్దార్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, కీసర డిప్యూటీ కమిషనర్‌ల సేవలను అభినందించారు.భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ట్రాఫిక్ డీసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, కీసర పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివకుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.మహోత్సవాల నిర్వహణలో భాగస్వాములైన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్యక్రమాలను ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు దేవస్థానం కృతజ్ఞతలు తెలిపింది.శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని దేవస్థానం ప్రతినిధులు ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మిషన్ భగీరథ నీటితో ఆరోగ్య భద్రత మిషన్ భగీరథ నీటితో ఆరోగ్య భద్రత
పెద్దమందడి,ఫిబ్రవరి19(తెలంగాణ ముచ్చట్లు):  మిషన్ భగీరథ త్రాగునీరు వినియోగంతో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వీరాయిపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల వెంకటయ్య అన్నారు. పెద్దమందడి మండలం లోని వీరాయిపల్లి...
కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి
జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని కలిసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 
ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా సీఐటీయూ ఘన నివాళులు
పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి