పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి
పెద్దమందడి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు కావాలి లక్ష్మి - కావలి రాజు, గొల్ల కొండమ్మ- కురుమయ్య మాట్లాడుతూ.. తాము ఎన్నో సంవత్సరాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని,5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అలాగే ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సురక్షితమైన సొంత ఇల్లు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నాం. వెల్టూర్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు.వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ..గ్రామంలో మొత్తం 36 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.సుమారు కోటి 80 లక్షల రూపాయల పనులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, ఐ సత్య రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, సి వెంకటయ్య, డి ఎస్ మహేష్, వడ్డే శేఖర్, మల్లికార్జున్, గుండెల ఆంజనేయులు, రవీందర్, మిల్లర్ రాజు, చందు రెడ్డి, వివేక్, ఆంజనేయులు గౌడ్, కావలి వెంకటయ్య, మద్దూర్ నరసింహ, మద్దూర్ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments