హెచ్ఎంటి నగర్‌లో సిమెంట్ రోడ్డు పనుల మాజీ కార్పొరేటర్ పర్యవేక్షించారు

రూ.10 లక్షలతో రాఘవేంద్ర నగర్ కాలనీ ఎంట్రన్స్‌లో అభివృద్ధి పనులు

హెచ్ఎంటి నగర్‌లో సిమెంట్ రోడ్డు పనుల మాజీ కార్పొరేటర్ పర్యవేక్షించారు

నాచారం, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో నాచారం ప్రాంతంలో సుమారు రూ.9 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. ఆ పనులు ప్రస్తుతం దశలవారీగా ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు నాచారం రైతు బజార్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.3 కోట్లు, ఎర్రగుంటలోని హిందూ స్మశానవాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేయడానికి రూ.2.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.అలాగే హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును రూ.30 కోట్లతో సుందరీకరించినట్లు, త్వరలోనే చెరువును ఖాళీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మక్తాల శేఖర్ గౌడ్, సంఘం యాదగిరి, విట్టల్ యాదవ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు. ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు): మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...
నారు సిద్ధం, నీటి కోసం నిరీక్షణ వర్షాభావంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం.
కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.