వ్యసనాలకు 'నో' చెప్పండి.. బాధ్యతాయుత పౌరులుగా ఎదగండి.

యువతకు ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ సందేశం.

వ్యసనాలకు 'నో' చెప్పండి.. బాధ్యతాయుత పౌరులుగా ఎదగండి.

IMG-20260704-WA0042జమ్మికుంట టౌన్ జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు): 

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం జమ్మికుంట మండలంలోని విలసాగర్ గ్రామంలో యువతకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, గ్రామ భద్రత కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం యువతతో కలిసి వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ హితం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .