జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

వనపర్తి,జూన్25(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రామాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన జమ్ములమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతల పండుగలు గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.జమ్ములమ్మ అమ్మవారి కృపతో రామాపురం గ్రామంతో పాటు వనపర్తి నియోజకవర్గం మొత్తం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు యాపర్ల రామిరెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, వెంకటేష్ సాగర్, గ్రామ నాయకులు సత్యనారాయణ రెడ్డి, భగవంతుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .