అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి

పనిచేయని సీసీ కెమెరాలే దొంగలకు అండా..?

వేలేరు, జూన్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన పోలు కోమారికి చెందిన 6 మేకలను గత బుధవారం రోజున గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళ మేకల కొట్టం నుంచి ఎత్తుకెళ్లారు. దొంగిలించబడిన మేకల విలువ సుమారు రూ.90 వేల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.గ్రామంలో సంవత్సరాలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు నిర్భయంగా తమ పనులు కానిచ్చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలోనూ పలు మూగజీవాల దొంగతనాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
"సీసీ కెమెరాలు ఉంటే దొంగలు దొరికేవారు.. కానీ అవి నిర్వీర్యంగా మారడంతో దొంగలకు గ్రామం అడ్డాగా మారింది" అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .