పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.

- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం

- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం

జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.45 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధీకరణ యంత్రాంగం (ఎస్‌టీపీ) మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు మంజూరులో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ఒడితల ప్రణవ్ బాబు కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో చర్చించి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించడంలో ప్రణవ్ బాబు విశేష కృషి చేశారని కొనియాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప కానుకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ బాబులకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సాయిని రవి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొలుగూరి సదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, ఎగిత అశోక్, కుతాడి తిరుపతి, పాతకాల అనిల్, ముద్దమల్ల రవి, యాట్ల అశోక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి లింగారావు, నాగమల్లి అశోక్, పొనగంటి రవీందర్, పొనగంటి మధు, పోతుల శ్రీనివాస్, పాత ప్రసాద్ రెడ్డి, రాజ్‌కుమార్, కమలాకర్, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .