గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.

గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.

పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు.చిన్నారులు పలకలపై తొలి అక్షరాలు దిద్దగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు.అనంతరం ఇదే పాఠశాలలో చదివి వివిధ గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, యువకులు, తల్లిదండ్రులు మరియుగ్రామస్థులు పాల్గొన్నారు.IMG-20260617-WA0103

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .