విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ.

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ.

పెద్దమందడి,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం  మణిగిల్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్, నస్రీన్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, గ్రామ పెద్దలు సుంచరామోని రాములు, పోతుల రామిరెడ్డి, పొంది ప్రతాప్ రెడ్డి, మందడి బంధి, మండల శ్రీనివాస్, రాములు, సాగర్, బోడి గణేష్, బి.కే. నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .