బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.
Views: 0
On
అడ్డాకుల,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం సుంకరాంపల్లి గ్రామంలో ఈ నెల 18న నిర్వహించనున్న బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి తన వంతు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు, గ్రామస్తులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.బొడ్రాయి, పోచమ్మ దేవత, రాయికంటి ఎల్లమ్మ దేవత బలిపీఠం, ధ్వజస్తంభ నూతన ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించిన రాజశేఖర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కందూర్ రమేష్, సుంకరాంపల్లి గ్రామ సర్పంచ్ ఆకులముని రవి, మాజీ సర్పంచ్ నాగరాజు, భీమన్న, రాములు, కృష్ణయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Jun 2026 23:12:08
ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు...


Comments