గ్రామ గ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలి.

రాష్ట్ర నాయకుడు దొడ్డె సమ్మయ్య.

గ్రామ గ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలి.

జమ్మికుంట టౌన్ మే 31(తెలంగాణ ముచ్చట్లు):

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేసి పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు దొడ్డె సమ్మయ్య పిలుపునిచ్చారు.

ఆదివారం జమ్మికుంటలో నిర్వహించిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు మంద సమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దొడ్డె సమ్మయ్య మాట్లాడుతూ పార్టీ విస్తరణ కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ గ్రామాన గడపగడపకు వెళ్లి బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. బహుజన వర్గాల అభ్యున్నతే బీఎస్పీ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), వేల్పుల మల్లేష్, మారముల్ల సాంబయ్య, రాచపల్లి రమేష్, గరిగే చంద్రయ్య, రామ్ శ్రీనివాస్, మొలుగూరి శ్రీనివాస్, బీసీ నాయకులు మామిండ్ల మల్లయ్య, దాసరపు ప్రవీణ్, అంబాల అంజి, కోరి రంజిత్, మడిపల్లి చక్రపాణి, హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా, మీడియా ఇన్‌చార్జ్ మంద జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .