ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.

ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేశారు.
మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు. అదే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలతో పరీక్షలు నిర్వహించారు. తనిఖీల సమయంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు, సీట్ బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహరావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. కొద్దిసేపటి నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగులుస్తుందని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత వేగవంతమైన డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మానుకోవాలని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉండేందుకు పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలీసులు చేపడుతున్న ఈ ప్రత్యేక తనిఖీలు ప్రజల రక్షణ కోసమేనని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. రాబోయే రోజుల్లో కూడా మండలంలోని పలు ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలు కొనసాగనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎడ్కానిస్టేబుళ్లు విటల్, భాస్కర్ రెడ్డి, రాజు, ఆఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.