సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యాలపై ఫోకస్.

సత్తుపల్లి ఏరియాలో మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ సమావేశాలు.

సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యాలపై ఫోకస్.

సత్తుపల్లి, మే 16(తెలంగాణ ముచ్చట్లు): 

సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి, రవాణా లక్ష్యాల సాధనపై సత్తుపల్లి ఏరియా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో శనివారం సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ నాయకత్వంలో జీఎం కార్యాలయంలో పత్రిక విలేకర్ల సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి వివరాలను సమీక్షించిన అధికారులు, ప్రస్తుత సంవత్సరానికి సంస్థ వ్యాప్తంగా నిర్దేశించిన 65 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలపై చర్చించారు. సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ నుంచి 110 మిలియన్ టన్నులు, కిష్టారం ఓసీ నుంచి 24 మిలియన్ టన్నులు, జేవీఆర్ సీహెచ్‌పీకి 134 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులను సమన్వయం చేయడమే మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీలలో జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, జేవీఆర్ సీహెచ్‌పీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మల్టీ డిపార్ట్మెంట్ టీమ్‌లో ఎస్‌వోటు జీఎం శ్రీ బొల్లం శ్రీనివాస్, డీజీఎం(ఈ అండ్ ఎం) శ్రీ కె. సోమశేఖరరావు, ఏజీఎం(ఎఫ్ అండ్ ఏ) శ్రీ భీభాత్స, పర్సనల్ మేనేజర్ శ్రీ ఎల్. తిరుపతి, డీజీఎం(ఐఈ) శ్రీ ఎన్. యోహాన్, అదనపు మేనేజర్ శ్రీ కె. సత్యనారాయణ రాజు సభ్యులుగా ఉన్నారు. అనంతరం జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, జేవీఆర్ సీహెచ్‌పీ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, యూనియన్ ప్రతినిధులు, ఉత్తమ ఉద్యోగులతో సమావేశమై వారి సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఏఎల్ఎస్‌వీ సునీల్ వర్మ, జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ డి. శ్రీనివాసరావు, ఎస్‌వోఎం శ్రీ బి. రాజేశ్వరరావు, కిష్టారం ఇన్‌చార్జి మేనేజర్ శ్రీ వి. బాబు, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ శ్రీ సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ ఎస్. సుధాకర్, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి. కోటేశ్వరరావు, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ కె. శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .