సలీం సేవలను కాంగ్రెస్ ఎప్పటికీ మరవదు : తాజుద్దీన్
జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సలీం మృతి పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలీం, చికిత్స పొందుతూ మే 14న కన్నుమూశారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ డీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్, సలీం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సలీం కేవలం నాయకుడు మాత్రమే కాదు.. పార్టీ కోసం చివరి వరకు అంకితభావంతో పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త. పార్టీ కష్టకాలంలో కూడా వెనుకడుగు వేయకుండా కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన వ్యక్తి” అని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు.
సలీం మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్న తాజుద్దీన్, వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మొహమ్మద్ కలీమొద్దీన్, మొహమ్మద్ అజీమ్, లాయఖ్ ఖాద్రీ, ఫజల్ రెహ్మాన్, సలీం పాష తదితరులు పాల్గొన్నారు.


Comments