సారంగపల్లి గ్రామంలో పోలీసుల కార్డన్ సర్చ్.

సారంగపల్లి గ్రామంలో పోలీసుల కార్డన్ సర్చ్.

*సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్*
 
*మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ హెచ్చరిక*
 
 *ప్రజల భద్రతే మా బాధ్యత*
 
మంచిర్యాల,మే12 (తెలంగాణ ముచ్చట్లు)
 
మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో మంగళవారం పోలీసులు కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు, గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, వీధులలో తిరుగుతూ తనిఖీలు చేపట్టారు, సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు, అనంతరం మందమర్రి సిఐ పర్స రమేష్ మాట్లాడుతూ అసాంఘిక  కార్యక్రమాలను అరికట్టడానికి, ప్రజలకు భద్రత భావాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు  తెలిపారు, వాహనదారులు తప్పకుండా సరైన పత్రాలతో పాటు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆదేశించారు, అనంతరం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు, ముఖ్యంగా ఓటీపీలు, అనధికార లింకులు క్లిక్ చేసి సైబర్ వలలో పడొద్దని గుర్తు చేశారు, గ్రామంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని అన్నారు, అలాగే ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోని పోలీసులకు సహకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్ఐ నరేష్, రామకృష్ణాపూర్  ఎస్సై శ్రీధర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .