తల్లిదండ్రులను చైతన్యపరిచిన ప్రభుత్వ పాఠశాల* ఉపాధ్యాయులు.

తల్లిదండ్రులను చైతన్యపరిచిన ప్రభుత్వ పాఠశాల* ఉపాధ్యాయులు.

ఎల్కతుర్తి, మే 14 (తెలంగాణ ముచ్చట్లు): 
 
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం, విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ఎల్కతుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని బావుపేట, తిమ్మాపూర్, ఎల్కతుర్తి, దామెర గ్రామాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బడి బాట ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ విద్య ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన గురించి అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటు డిజిటల్ తరగతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తుకు అనుగుణంగా మెరుగైన విద్య అందిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో చదువుకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
బావుపేట పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు ఎల్. మనోహర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి తల్లిదండ్రుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరయ్య చారి, శ్రీధర్, సునీత, మర్రి రవికుమార్, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, కారోబార్ మొగిలయ్య, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News