ఉపాధి హామీ పనిలో విషాదం.. గుండెపోటుతో కూలీ మృతి.

ఉపాధి హామీ పనిలో విషాదం.. గుండెపోటుతో కూలీ మృతి.

వేలేరు, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
 
హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని షోడశపల్లి గ్రామానికి చెందిన కీర్తి కొమురయ్య ఉపాధి హామీ పథకం ( 100 )రోజుల పనిలో భాగంగా ఎర్రకుంట చెరువులో శనివారం పని చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
 
రోజువారీ కూలీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్లు తోటి ఉపాధి కూలీలు తెలిపారు. వెంటనే స్పందించిన సహచరులు చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
మృతుడు కీర్తి కొమురయ్య కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఉపాధి కూలీలు మరియు గ్రామస్థులు కోరుతున్నారు.
అధికారులు వేసవి కాలంలో ఉపాధి పనుల సమయంలో కూలీల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .