రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాల బంద్
డీలర్ల ఆందోళనకు పిలుపు
Views: 22
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఎరువుల దుకాణాలు మూసివేయబడనున్నాయి. ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ ఎరువుల డీలర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు వెల్లడించారు.
డీలర్లకు అనుకూలంగా ఎరువుల సరఫరా వ్యవస్థలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎఫ్‌వోఎల్ (FOL) విధానాన్ని అమలు చేయాలని, అలాగే లింక్ ప్రొడక్ట్ విధానం లేకుండా ఎరువులను అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల వల్ల డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డీలర్ల బంద్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు నిలిచిపోనున్నాయి. దీంతో రైతులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని భావిస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపట్టే అవకాశముందని డీలర్లు హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments