ఆధ్యాత్మిక సందేశాలతో అలరించిన హిందూ సమ్మేళనం
బొమ్మల గుడిలో జోష్
Views: 6
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) ఆవరణంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం, గోపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం ఈరోజు హిందూ బంధువులతో కళకళలాడుతుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచి దిశానిర్దేశం చేస్తాయని, ముఖ్యంగా యువత చెడు అలవాట్లు, వ్యసనాల వైపు వెళ్లకుండా భక్తి మార్గాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించారు.
కార్యక్రమంలో శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి మాలదారులు, భక్తులు కలిసి భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భగవంతుని ఆరాధన ద్వారా కుటుంబ విలువలు పెంపొందుతాయని, పెద్దలను గౌరవించే సంస్కారం బలపడుతుందని చైర్మన్ వివరించారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల వారికి కూడా భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందా రాజు, శీలం శ్రీనివాస్, మాచర్ల రాజు, లక్ష్మణ్, వేణు, స్వామి సురేష్ ఆత్మరావ్ మహారాజ్, అధ్యక్షుడు పాకాల రవీందర్ రెడ్డి, కరీంనగర్ విభాగ్ భౌతిక్ ప్రముఖుడు సామల కిరణ్, వివేకానంద కేంద్ర కార్యకర్త గుండా సుధాశ్రీ, దావులూరు మురళి, గందె రఘు, యమసాని సురేష్, దాసరి రవీందర్, సందిరి సారంగపాణి, ఎక్కడి రఘోతం రెడ్డి, ఆవాల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తుల భారీ హాజరుతో ఈ సమ్మేళనం ఆధ్యాత్మికోత్సవంగా మారింది.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments