ఆడబిడ్డ పెళ్లికి అండగా సర్పంచ్ – పీచరలో నగదు సహాయం

ఆడబిడ్డ పెళ్లికి అండగా సర్పంచ్ – పీచరలో నగదు సహాయం

వేలేరు, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు  ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలుస్తూ రూ.5,116 నగదు సహాయం అందించారు. ఓర్సు రజిత–స్వామి దంపతుల కుమార్తె శ్రావణి మరియు మహేష్‌ల వివాహానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లిళ్లలో సహాయం చేయడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మారబోయిన రాజు గౌడ్, పీచర బీఆర్ఎస్ కన్వీనర్ ఎండీ హరీఫ్, ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డ్ సభ్యులు గుడికందుల రాకేష్, నాయకులు అవునూరి శ్యామ్, శివరాత్రి రవీందర్, సమ్మక్క సారక్క దేవస్థానం చైర్మన్ గొల్లెన రమేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News