ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.

పామిరెడ్డిపల్లిలో పాఠశాలపై సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.

పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల హాజరు మరియు బోధన పరిస్థితులపై ఆరా తీశారు.తదనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం వడ్డించాలని వంట సిబ్బందికి స్పష్టంగా సూచించారు.భోజనంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.అదేవిధంగా పాఠశాల ఆవరణ పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ, పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ తిరుపతిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు మధిర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .