గంగారం సెక్టార్‌లో డీ.డబ్ల్యూ.ఓ ఆకస్మిక పర్యటన.

గంగారం సెక్టార్‌లో డీ.డబ్ల్యూ.ఓ ఆకస్మిక పర్యటన.

- అంగన్వాడీల పనితీరుపై ప్రశంసలు.
- చిన్నారులతో ముచ్చటించిన విజేత.

సత్తుపల్లి, ఏప్రిల్‌ 21(తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని గంగారం గ్రామం సెక్టార్‌లో అంగన్వాడీ కేంద్రాలను జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) విజేత మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రాలకు వెళ్లిన ఆమె చిన్నారులతో కూర్చొని మాట్లాడారు. “గుడ్లు సమయానికి ఇస్తున్నారా? ఆటలు ఆడిస్తున్నారా?” అని అడగగా, పిల్లలు ఆనందంగా “రోజూ ఇస్తున్నారు, ఆటలు కూడా ఆడిస్తున్నారు” అని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల బరువును తూకం వేసి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎలాంటి అక్రమ చెల్లింపులు చేస్తున్నారా అని ప్రశ్నించగా, అలాంటివి ఏవీ లేవని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా విజేత మాట్లాడుతూ, ఎక్కడైనా విధుల్లో IMG-20260421-WA0089నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తనిఖీల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని, కేంద్రాల పనితీరు బాగుందని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .