మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మల్లాపూర్, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మల్లాపూర్ డివిజన్‌లో శనివారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాల నిర్మూలన కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధి, బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకుంటూ ఆయన సేవలను స్మరించుకుంటారని, సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.జ్యోతిబా పూలే ఆశయాలను యువత అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే సేవలను స్మరించుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News