అహ్మద్‌గూడలో దాంపత్య విభేదాలు విషాదాంతం

అహ్మద్‌గూడలో దాంపత్య విభేదాలు విషాదాంతం

– డాక్టర్ ఆత్మహత్య

_భార్య ఫిర్యాదు, తండ్రి ఆరోపణలతో రెండు కేసులు నమోదు 

– అన్ని కోణాల్లో దర్యాప్తు

కీసర, ఏప్రిల్  01(తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకీసర మండలంలోని అహ్మద్‌గూడలో దాంపత్య విభేదాలు ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. శ్రీ లక్ష్మీ ఎన్‌క్లేవ్‌కు చెందిన పి. వీణపాణి మరియు ఆమె భర్త డా. పసల జోసెఫ్ వినోద్ కుమార్ మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31న వీణపాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.అదే రోజు సాయంత్రం మృతుడి తండ్రి పసల ఆరోగ్యమయ్య పోలీస్ స్టేషన్‌కు హాజరై, తన కుమారుడు జోసెఫ్ వినోద్ కుమార్ (40) తన భార్య చేత మానసిక వేధింపులకు గురై, రాంపల్లి దయ్యారా ఔటర్ రింగ్ రోడ్ వద్ద తన కారులో గుర్తుతెలియని ఇంజెక్షన్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండు కేసులను అనుసంధానించి దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో పరిశీలించి, సాక్ష్యాధారాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి అంజనేయులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .