స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు

స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు

_హృదయ శస్త్రచికిత్స విజయవంతం 

– కుటుంబానికి ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బంజారా హిల్స్‌లోని స్టార్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పాండిచేరి రాష్ట్రం తిరునల్లార్ శ్రీ దర్బారన్యేశ్వర స్వామి దేవస్థానం పూజారి మహాలింగ గురుక్కల్‌ను పరామర్శించారు.ఇటీవల గురుక్కల్‌కు జరిగిన హృదయ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గురుక్కల్ కుమారుడు దిలీప్ స్వామికి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గురుక్కల్ ఆశీర్వచనాలను స్వీకరించారు.అలాగే, స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ డా. గుడపాటి రమేష్‌ను మహాలింగ గురుక్కల్ సన్మానించి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ఉప్పలపాటి శ్రీకాంత్, నర్నె శ్రీనివాస్ రావు, సోలిస్ కంటి హాస్పిటల్ చైర్మన్ నందనంపాటి రాము, అరికపూడి ప్రసాద్, మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, శంకర్ బాబు, రామకృష్ణ, సుబ్బా రావు, లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260401-WA0119

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .