ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయ పతాక ఆవిష్కరణ

3280 అడుగుల జెండాతో ప్రత్యేక ఆకర్షణ

ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయ పతాక ఆవిష్కరణ

చర్లపల్లి, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ గడ్డం యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3280 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి భావాలను వ్యక్తపరిచారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి “జై హింద్”, “వందే మాతరం” నినాదాలతో ప్రాంతాన్ని దేశభక్తి వాతావరణంతో నింపారు. పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో చెర్లపల్లి సీఐ సుధాకర్, ఎస్‌ఐ శేఖర్, ఈసీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సీతారాం రెడ్డి, కెవి ఎల్ ఎన్ రావు, నరేందర్, వెంకటేష్, మనోహర్, ప్రేమ్, ఆనంద్ రాజ్ గౌడ్, రామచంద్ర గౌడ్, రెడ్డి నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.IMG-20260401-WA0092

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .